స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో రష్మిక కథానాయిక. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న “పుష్ప ” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా “పుష్ప ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరో అల్లు అర్జున్ “పుష్ప ” మూవీ తరువాత పలు మూవీస్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారని , దర్శకులతో రోజూ వీడియో కాల్స్ తో టచ్ లో ఉంటూ స్టోరీ లైన్ నచ్చితే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెబుతున్నట్టు సమాచారం. సక్సెస్ ఫుల్ “ఆనందో బ్రహ్మ “, “యాత్ర ” మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ వినిపించిన పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ లైన్ నచ్చి రాజకీయ ప్రస్తావన తగ్గిస్తూ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారని, ఈ మూవీ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పివిపి బ్యానర్ పై మహి వి రాఘవ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాజకీయాలలో జరుగుతున్న అవినీతి పై ఒక సామాన్యుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























