
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎన్ని సంచనాలు సృష్టించిందో తెలుసు. ఈ సినిమా 1990 మే 9వ తారీకున రిలీజ్ అవ్వగా.. ఈ ఏడాదితో 30 ఏళ్లు అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్బంగా ఈ సినిమా తెర ముందు విశేషాలను, తెర వెనుక విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని వైజయంతి మూవీస్ వారు నాని వాయిస్ ఓవర్‌తో ఒక వీడియోను చేయించారు. అందులో భాగంగా నాని వాయిస్ ఓవర్‌తో మొదటి పార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. సినిమా తీసే విధానం, చూసే విధానంను మార్చిన ఈ చిత్రం ఎలా పుట్టిందంటే అంటూ నాని వాయిస్ సాగింది.పాతికేళ్ల లోపు వయసులోనే నిర్మాతగా మారిన అశ్వినీదత్ గారికి ఎన్టీఆర్ నటించిన జగదేక వీరుడి కథ లాంటి ఒక ఫాంటసీ చిత్రాన్ని తీయాలని కోరిక. అది కూడా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేయాలని.




ఈ నేపథ్యంలో అశ్విని దత్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి, రాఘవేంద్రరావు తిరుపతికి వెళ్లగా… అక్కడ కొండపై ఉండగా శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూమిపైకి వచ్చినపుడు ఆమె ఉంగరం పోగుట్టుకుంటుంది. అది చిరంజీవి దొరుకుతుంది. అని కొంచెం ఊహాజనితంగా ఈ కథ ముఖ్యపాయింట్ను చెప్పారట. అది రాఘవేంద్రరావుగారికి బాగా నచ్చింది. అశ్వినీదత్ గారి కథకు దగ్గరగా ఉంది ఆయనకూ నచ్చింది. మరి జగదేక వీరుడికి జోడిగా అతిలోకసుందరి ఎవరు ? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే.. వైజయంతి ఆస్థాన నాయక.. వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. దానికి తగ్గట్టు కథ రాయడానికి రచయితలు కావాలి. దానికి జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, విజయంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ వంటి దిగ్గజ రచయితను ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు వారితో కలిసి చిరంజీవి కూడా కథా చర్చల్లో పాల్గొన్నారు. ఇక దేవకన్యగా అతిలోకసుందరి చూపిస్తున్నపుడు నేను కొంచెం మాసిన గడ్డంతో ఉంటే బాగుంటుంది కదా అనే సలహా కూడా ఇచ్చారట. దీంతో నార్మల్ ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారట. మరోవైపు శ్రీదేవి ఈ సినిమాలో తన కాస్ట్యూమ్స్‌కు తానే కుట్టించుకోవడం మొదలపెట్టారట. అలా అందరూ కలిసి ఈ చందమామ కథకు అందమైన రూపు ఇచ్చారు. చరిత్ర సృష్టించిన ఈ సినిమా విశేషాలు ఇంకా ఉన్నాయని రేపు మరొక వీడియోతో కలుస్తానని చెప్పాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























