‘సింహా’, ‘లెజెండ్’ వంటి ఘనవిజయాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒక పాత్ర కోసం అఘోరాగా కనిపిస్తారని టాక్. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ‘యన్.బి.కె.106’కు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్‌ని బాలయ్య 60వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై మరింత స్పష్టత రానుంది. మరి.. గత చిత్రాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న బాలయ్య, బోయపాటి కాంబినేషన్.. రాబోయే సినిమాతోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































