శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు 38 ఏళ్ళు

Creative Director Kodi Ramakrishna Debut Movie Intlo Ramayya Veedilo Krishnayya Turns 38

తెలుగునాట శతకం చూసిన దర్శకులు అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో అగ్రశ్రేణి దర్శకుడు కోడి రామకృష్ణ ఒకరు. అలాంటి కోడి రామకృష్ణ మెగా ఫోన్ పట్టి రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. మెగాస్టార్ చిరంజీవి, మాధవి జంటగా నటించిన ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు, సంగీత, పూర్ణిమ, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ, కాకినాడ శ్యామల ముఖ్య భూమికలు పోషించారు. కోడి రామకృష్ణ కథకు గొల్లపూడి మారుతీరావు సంభాషణలు సమకూర్చారు. అంతేకాదు.. ఈ సినిమాతోనే గొల్లపూడి నటుడిగానూ తెరంగేట్రం చేయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డా.సి.నారాయణ రెడ్డి గీత రచనకు జె.వి.రాఘవులు స్వరాలు సమకూర్చారు. “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య”, “ఒక వనిత నవ ముదిత”, “పలికేది వేదమంత్రం”, “వచ్చే వచ్చే వాన జల్లు”, “సీతారాముల ఆదర్శం”, “స్వామియే శరణం అయ్యప్ప”.. ఇలా ప్రతీ పాట శ్రోతలను అలరించింది. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.రాఘవ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘వీటుల రామన్ వెలియిల కృష్ణన్’(1983), కన్నడంలో ‘మనేలి రామన్న బీదిలి కామన్న’(1983), హిందీలో ‘ఘర్ మే రామ్ గలి మే శ్యామ్’(1988)గా పునర్నిర్మించారు. 1982 ఏప్రిల్ 23న విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’.. నేటితో 38 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.