ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ హిట్ “అష్టా చెమ్మా ” మూవీతో నాని ని హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ , నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ లో నెగటివ్ పాత్ర లో పరిచయం చేయడం విశేషం. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



“టక్ జగదీష్ ” మూవీ తరువాత నాని సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా”మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్” మూవీలో నటించనున్నారు. హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన థ్రిల్లర్ మూవీ “హిట్ ” ఘనవిజయం సాధించింది.ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందే మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శైలేష్ కొలను నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి , కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే నాని ఓకే చేసినట్టు సమాచారం. విభిన్న కథాంశాల చిత్రాలు ఎంపిక చేసుకుని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ నాని ప్రేక్షకులను అలరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























