ఆ లిస్ట్ లో మణిరత్నం కొడుకు కూడా..!

Ace Director Mani Ratnam Son Nandan Mani Ratnam Gets Applauded By Netizens

కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించి పోయింది. రోజు రోజుకి ఈ వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటంతో.. ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. అంతేకాదు ఎవరికి వారు స్వయంగా జాగ్రత్తులు తీసుకుంటున్నారు. స్వతహాగా గృహ నిర్బంధం అవుతున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీస్ అందరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సీనియర్‌ నటి సుహాసినిల కుమారుడు నందన్‌ మణిరత్నం అదే చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం లండన్‌ నుంచి వచ్చిన ఆయన కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షలో కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికి బాధ్యతగా వ్యవహరించి తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నారు. తమ ఇంట్లోని ఓ ప్రత్యేక గదిలో ఉండిపోయారు.సినీ నటి ఖుస్భూ ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు చేసే పనిది. సుహాసిని, నందన్‌మణిరత్నాలకు నా అభినందనలు. వీరి నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. నీ స్వీయ నిర్బంధం చక్కగా గడవాలని కోరుకుంటాన్నా’నని ఖుస్భూ పేర్కొన్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.