ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?

Pooja Hegde To Act In Female Centric Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie News,Pooja Hegde Next Project News,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde New Movie News,Pooja Hegde Upcoming Film Details,Pooja Hegde Female Centric Movie

ఒక‌వైపు గ్లామ‌ర్ రోల్స్ లో మురిపిస్తూనే.. మ‌రోవైపు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ అల‌రిస్తోంది పూజా హెగ్డే. వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ.. త్వ‌ర‌లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో న‌టించ‌బోతోంద‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `అందాల రాక్ష‌సి`, `కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌`, `లై`, `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఓ నాయికా ప్రాధాన్య‌మున్న క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడ‌ట‌. ఆ క‌థ‌లో నాయిక‌ పాత్ర‌కి పూజ అయితేనే బావుంటుంద‌ని భావించి… ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ట‌. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో పూజ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. త్వ‌ర‌లోనే పూజ‌, హ‌ను కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.


ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`తో పాటు `ప్ర‌భాస్ 20`లో న‌టిస్తోంది పూజ‌. అలాగే స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించ‌నున్న హిందీ చిత్రం `క‌భీ ఈద్ క‌భీ దీవాళి`లోనూ పూజనే నాయిక‌. మ‌రి.. తొలిసారి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో న‌టించ‌నున్న పూజ‌కి స‌ద‌రు చిత్రం ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.