రెండు వ‌రుస రోజుల్లో న‌భా న‌టేష్ చిత్రాలు

Nabha Natesh To Woo Audience With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nabha Natesh,Nabha Natesh Latest News,Nabha Natesh New Movie News,Nabha Natesh Next Project Updates,Nabha Natesh Latest Film Updates,Nabha Natesh Upcoming Film News

`న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రంతో తెలుగుతెర‌కు క‌థానాయిక‌గా పరిచ‌య‌మైంది న‌భా న‌టేష్. ఆ సినిమా నిరాశ‌ప‌రిచినా… గ‌త ఏడాది జూలైలో విడుద‌లైన‌ `ఇస్మార్ట్ శంక‌ర్`తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకుంది న‌భా. అయితే, గ‌త చిత్రం `డిస్కో రాజా` ఆశించిన విజ‌యం సాధించ‌ని నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాలు న‌భా కెరీర్ కి కీల‌కంగా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే.. న‌భా నాయిక‌గా న‌టిస్తున్న త‌దుప‌రి రెండు చిత్రాలు కూడా రెండు వ‌రుస రోజుల్లో రిలీజ్ కాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `అల్లుడు అదుర్స్`, `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కి జంట‌గా న‌భా న‌టిస్తున్న‌`అల్లుడు అదుర్స్` ఏప్రిల్ 30న విడుద‌ల కానుండ‌గా.. సాయితేజ్ కి జోడీగా న‌టిస్తున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` మే 1న రిలీజ్ కానుంది. మ‌రి.. బ్యాక్ టు బ్యాక్ డేస్ లో వ‌స్తున్న ఈ మూవీస్ తో న‌భా ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.