మొత్తానికి కె.జి.ఎఫ్2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు చిత్రయూనిట్. మొన్నటి వరకూ పలు డేట్ లు తెరపైకి వచ్చాయి. మొదట ఈ సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు.. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వడంతో ముందుగా ఆర్ఆర్ఆర్ అనుకున్న డేట్ జులై 30 న తమ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక గత కొద్దిరోజులుగా ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా అదే రోజు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు రాగా దానిపై యష్ స్పందించి అది ఎప్పటికీ జరగదని చెప్పాడు. ఇక ఇవన్నీ ఎందుకులే అనుకున్నారేమో కానీ తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. హోంబలే ఫిలింస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#KGFChapter2 Worldwide Grand Release On October 23rd, 2020.#KGFChapter2OnOct23 @TheNameIsYash @prashanth_neel @VKiragandur @duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @Karthik1423 @AAFilmsIndia @excelmovies @FarOutAkhtar @ritesh_sid @VaaraahiCC pic.twitter.com/kq060lfNZM
— Hombale Films (@hombalefilms) March 13, 2020



కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























