విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో… ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. మార్చి 14 కరీంనగర్, మార్చి 19 తిరుపతి, మార్చి 21 హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించనున్నారు.

ఇంకా ఈ సినిమాలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























