`మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో `ఆచార్య` పేరిట ఓ సోషల్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఆగస్టులో జనం ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ వెంచర్ ని ప్లాన్ చేస్తున్నాడట శివ. అంతేకాదు.. ఈ చిత్రాన్ని తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ తో కలసి యువ సుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తాడని అంటున్నారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళుతుందట.



వాస్తవానికి… 2013లోనే చరణ్ తో శివ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. అయితే, పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మొత్తానికి ఎనిమిదేళ్ళ తరువాత ఈ కాంబోలో ప్రాజెక్ట్ సెట్ కానుండడం ఆసక్తికరమనే చెప్పాలి. త్వరలోనే చెర్రీ, కొరటాల కాంబో మూవీపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























