ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ‘ఓరు కుట్టి కథ’ అనే ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకోసం పోస్టు ప్రొడక్షన్ పనులను చాలా వేగంగా పూర్తి చేయాలని చర్యలు చేపడుతున్నారట. మరి ఇది నిజమో?కాదో? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ హీరోగా.. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండటంతో ఇప్పటికే ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో కోలీవుడ్ లోనే కాదు ఇక్కడ కూడా అభిమానులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































