‘RRR’ రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!

KGF 2 to release on RRR Movie Date,KGF 2,KGF 2 Telugu Movie,KGF 2 Movie,RRR Movie,RRR,RRR Telugu Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,RRR Movie Date,KGF 2 Movie Date,KGF 2 and RRR Movie Date,RRR Movie Updates,RRR Movie Latest News

‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ డేట్ మారిన సంగతి తెలిసిందే. కాస్త ఎక్కువ టైమ్ పడుతుండటంతో అనుకున్న ముందుగా చెప్పిన డేట్ ను మర్చి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ ఏడాది 2020 జులై 30 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి మార్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అలా డేట్ మార్చిందో లేదో అప్పుడే మరో సినిమా ఆ రిలీజ్ డేట్ ను బుక్ చేసుకుంది. ఆ సినిమా ఏదో కాదు. ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.ఎఫ్2 సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రేర్ ఫీట్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఇదే జోష్ తో కె.జి.ఎఫ్‌ సీక్వెల్ కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 2 ను కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితో షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసి జులై 30 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.