టక్ జగదీష్ కోసం రంగంలోకి థమన్..!

Thaman To Score Tunes For Tuck Jagadish

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ సినిమా కోసం థమన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అద్భుతమైన పాటలందించి మరోసారి తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట థమన్. ఇక ఈ విషయాన్నే థమన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.


మరి అలా వైకుంఠపురంలో’ చిత్రం విజయంలో ఆడియో ఆల్బమ్ ఎంతటి పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థమన్ అందించిన పాటలు యుట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు థమన్ ఖాతలో ఉన్నాయి. మొత్తానికి సూపర్ హిట్ ఆల్బమ్స్ తో థమన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

[custom_ad]

కాగా శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో అదే కాంబినేషన్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా ఏమవుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.