త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సమైన కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి థమన్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ‘ సామజవరగమనా’, ‘రాములో రాములా’, బుట్ట బొమ్మ’ పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అద్భుతమైన ఆడియో అందించి సినిమాకు సగం సక్సెస్ అందించాడు. ఇక ఆ పాటలను సెలబ్రెటీలు సైతం ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అసలు సంగతేంటంటే… ప్రస్తుతం కేటీఆర్ స్విట్జర్లాండ్ లో వున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు అక్కడికివెళ్లారు. ఈ నేపథ్యంలో స్విస్ కాలమానం ప్రకారం… ప్రస్తుతం తెల్లవారుజామున 3.30 గంటలైందని, ఈ సమయంలో తన స్మార్ట్ ఫోన్ నుంచి ‘సామజ వర గమనా…’ పాటను వింటున్నానని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ‘వాటే బ్రిలియంట్ సాంగ్…’ అంటూ సంగీత దర్శకుడు థమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట తన మదిని వీడటం లేదని అన్నారు.
Jet lagged & up at 3:30 am Swiss time!
‘Samaja Varagamana’ on my playlist keeping me company. What a brilliant song!! @MusicThaman you’ve outdone yourself 👏 Cant get this one out of my head 😀 pic.twitter.com/lUGsopHlT0
— KTR (@KTRTRS) January 21, 2020
ఇక థమన్ కూడా సంతోషపడుతూ రీ ట్విట్ చేశారు. సినిమా పాటను మరీంత సెన్సేషన్ అయ్యేలా చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపాడు. మొత్తానికి కేటీఆర్ కు కూడా ఈ సాంగ్ నచ్చడం… స్పెషల్ గా ట్వీట్ చేయడం గొప్ప విషయమే.
[custom_ad]
Sirrrrrrrr coming this from the man I look upto ♥️ @KTRTRS u have made our song more sensational ✊
More power & more love to U sir ✨
Happy to knw tat our #sensationalsamajavaragamana is making ur day 🥁🥁🥁
We have got the best now 💿💿💿💿#godbless https://t.co/MUtOtGVKP4— thaman S (@MusicThaman) January 21, 2020
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























