చాలా కాలం తర్వాత ఎవరు సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రాబోతుంది. రెజీనా ప్రధాన పాత్రధారిగా ఓ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కబోతుంది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తో పటు తమిళ్ లో కూడా రూపొందించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో సూపర్‌హిట్ సాధించి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా ‘‘కార్తీక్ రాజు చెప్పిన కథ ఓ ప్రేక్షకుడిగా నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాకు నిర్మాతనయ్యా. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు ఇన్నోవేటివ్‌గా ఉంటున్నాయి. ‘ఎవరు’ తర్వాత రెజీనా నటిస్తున్న థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో ఆమె అర్కియాలజిస్ట్‌గా కనపడతారు. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటించాలనుకుంటున్నారు. అందుకోసం స్ట్టంట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు అని చెప్పారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడమే కాకుండా సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’ అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























