ఈ క్యాలెండర్ ఇయర్లో కొంతమంది బాలీవుడ్ భామలు… తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారిగా సందడి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విద్యా బాలన్:
పేరుకి దక్షిణాది మగువ అయినా… బాలీవుడ్ నటిగానే ప్రాచుర్యం పొందింది విద్యా బాలన్. జాతీయ పురస్కారాలతో సహా పలు అవార్డులను అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా… మహానటుడు యన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ తో కావడం విశేషం. ‘యన్టీఆర్ కథానాయకుడు’, ‘యన్టీఆర్ మహానాయకుడు’ పేర్లతో రెండు భాగాలుగా రిలీజైన ఈ బయోపిక్ లో విద్య… యన్టీఆర్ శ్రీమతి బసవతారకం పాత్రలో దర్శనమిచ్చింది. నటసింహ బాలకృష్ణ సరసన తన అద్భుత అభినయంతో కనువిందు చేసింది.
శ్రద్ధా కపూర్:
విద్యా బాలన్ తరహాలోనే మరో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా స్టార్ హీరో సినిమాతోనే తెలుగునాట తొలి అడుగేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ – ఇండియా ఫిల్మ్ ‘సాహో’లో తన అందచందాలతో కవ్వించింది శ్రద్ధ.
జరీన్ ఖాన్:
యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ ‘చాణక్య’తో మరో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విద్య, శ్రద్ధ తరహాలో మెయిన్ హీరోయిన్ గా కాకుండా… సెకండ్ లీడ్ లో సందడి చేసింది జరీన్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































