యంగ్ హీరో రాజ్ తరుణ్, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా.. జి.ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ సినిమాను డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి.ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకుంటూ మిగిలిన యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే గత కొద్దికాలంగా మాత్రం సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. గత ఏడాది జులై లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘లవర్ ‘ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























