ఒకటి కాదు రెండు కాదు జయలలిత జీవితం ఆధారంగా ఏకంగా మూడు మూడు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాటిలో రెండు సినిమాలు కాగా ఒకటి వెబ్ సిరీస్. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రయిలర్ బాగానే ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ సంస్థలో ప్రసారం కానుంది. డిసెంబర్ 14న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏ ఎల్ దర్శకత్వంలో ‘తలైవి’ పేరుతో ఒక సినిమా రూపొందిస్తుండగా ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తుంది. ప్రియదర్శిని దర్శకత్వంలో ‘ది ఐరన్ లేడీ’ లో నిత్యామీనన్ నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































