సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన మహర్షి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు వంశీ పైడిపల్లి. గత కొద్ది రోజులుగా మహర్షి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ వేశారు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతునట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు వంశీ . ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు వంశీ. త్వరలో ఈ సినిమా పైన ఆఫీషల్ అనౌన్స్ మెంట్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























