‘ఆకాశం నీ హద్దురా’ అంటున్న సూర్య

Suriya New Movie First Look Out Now,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Suriya New Movie First Look,Suriya Upcoming Movie First Look,Surya Aakasam Nee Haddura Telugu Movie,Suriya Latest News 2019,Aakasam Nee Haddura First Look

సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే ‘కాప్పాన్’ తెలుగులో ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. నల్లటి బనియన్ ధరించిన గాల్లోకి ఆనందంగా ఎగురుతున్న సూర్య లుక్ ఆకట్టుకుంటుంది.

కాగా కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నారు. మారా అనే పైలెట్‌ పాత్రలో సూర్య కనిపించనున్నారని తెలుస్తోంది. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీప్రకాశ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నికేత్‌ బొమ్మి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.