మారుతి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా.. నిన్న తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ పేరుతో ఓ వీడియో ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండగ సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈ సినిమాలో సాయి తేజ్ హీరో సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా… రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్యశ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మరి చాలా ప్లాప్స్ తర్వాత తేజ్ కు చిత్రలహరితో ఓ మంచి హిట్ దక్కింది. ఇక మారుతి కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ సినిమాతో మళ్ళీ తేజ్ మంచి హిట్ దక్కుతుందేమో..? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: