మొత్తానికి రవిబాబు మళ్ళీ తన ఓల్డ్ ఫార్మాట్ కే వచ్చేశాడు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసినా.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పెట్టాడు. ఆ తర్వాత ‘నచ్చావులే’, ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును’, ‘అవును 2’ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన మూవీ వస్తుందంటేనే అందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆడియెన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఇటీవలే ఆయన పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ అనే సినిమాని రూపొందించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో మళ్లీ దెయ్యం మూవీనే నమ్ముకున్నాడు. తాజాగా ‘ఆవిరి’ అనే సినిమాతో రాబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్… తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. చిన్న పాప మిస్ అవడం, ఆమెని ఆత్మ తీసుకెళ్లిపోయిందనుకుని ఫిక్స్ అవడం.. పాప మళ్లీ మళ్లీ ఎస్కేప్ అవడం.. ఆమెని కనిపెట్టడానికి వచ్చిన వాళ్లు ప్రమాదాలకు గురి కావడం.. ఇలా ఉత్కంఠతగా ఉంది ట్రైలర్.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారట. గతంలో వరంగల్ కలెక్టర్ అమ్రపాలి తమ ఇంట్లో ఏదో ఉందని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటది కదా. ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ కూడా అయింది. అయితే అలాంటి సంఘంటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారంట. ఆ స్టోరీ ఇన్స్పిరేషన్ తోనే రవి బాబు ఈ కథను రాసుకున్నాడట. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..!
ఇక ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు తన సొంత బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ మీదుగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 1న విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: