నారా రోహిత్ తొలి చిత్రం ‘బాణం’కు 10 ఏళ్ళు

10 Years For Nara Rohith In Tollywood,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Nara Rohith Completes 10 Years in Tollywood,Nara Rohith 10 Glorious years of tollywood,Best Movies of Nara Rohith,Nara Rohith Latest News,10 Years For Nara Rohith Baanam Movie

“ఐపీఎస్ పాసవ్వాలని కలలు కనే ఒక యువకుడు… త‌న‌కు ఎదురైన అనూహ్య ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి ఎలా గమ్యాన్ని చేరుకున్నాడు?” అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బాణం’. 80ల నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ పిరియాడిక్ ట‌చ్‌తో రూపొందిన ఈ సినిమాని… డెబ్యూ డైరెక్ట‌ర్ చైత‌న్య దంతులూరి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. నారా రోహిత్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో వేదిక కథానాయికగా నటించగా… షాయాజీ షిండే, రాజీవ్ కనకాల, భాను చందర్, రణధీర్ గట్ల కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామజోగయ్య శాస్త్రి, వనమాలి, కృష్ణ చైతన్య గీత రచనకు… “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ విన‌సొంపైన‌ బాణీలు అందించారు. “మోగింది జేగంట”, “నాలో నేనేనా”, “పదరా పదరా”, “కదిలే పాదం”, “బాణం – టైటిల్ సాంగ్”… ఇలా ప్ర‌తీ పాట క‌థ‌లో భాగంగా సాగుతుంది. విశేష‌మేమిటంటే…. ఆడియో ఫంక్ష‌న్‌లో ఈ ఐదు పాటలను నారా చంద్రబాబు నాయుడు, దాసరి నారాయణరావు, నందమూరి బాలకృష్ణ, అల్లు అరవింద్, జూ. యన్టీఆర్ వంటి రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు విడుదల చేయగా… వాటిని ఐదు వేర్వేరు టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేయడం విశేషం. 2009కిగానూ ద్వితీయ ఉత్త‌మ చిత్రంగా`నంది` పురస్కారాన్ని అందుకున్న ఈ సినిమాని… త్రీ ఏంజ‌ల్స్‌ స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించారు. 2009 సెప్టెంబర్ 16న విడుదలై పలువురి ప్రశంసలు పొందిన ‘బాణం’… నేటితో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే… నేటితో న‌టుడిగా నారా రోహిత్ ప్ర‌యాణానికి ద‌శాబ్దకాలం పూర్త‌వుతుంద‌న్న‌మాట‌..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.