చాలా ప్లాప్స్ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసీ ఇస్మార్ట్ గా హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చి వెంటనే ప్రస్తుతం ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేంటంటే.. ప్రభాస్ ను లైన్లో పెట్టే పనిలో పూరి ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో బుజ్జిగాడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడట. గతంలో మహేశ్ బాబుతో చేయాలనుకున్న ‘జనగణమన’ కథనే ప్రభాస్ కు చెప్పగా నచ్చిందని చెప్పడట. ఇక ప్రభాస్ అలా చెప్పిన దగ్గర నుంచి పూరి ఆయనకి టచ్ లో ఉంటున్నాడట.
ఇక ప్రభాస్ రీసెంట్ గా సాహో సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు. కానీ బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సాహో సినిమాతో ఆ రేంజ్ ఇంకా మారిపోయింది. సాహూ తర్వాత జిల్ ఫేమ్ రాధా కృష్ణ డైరెక్షన్ లో ‘జాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ పరిస్థితిలో ప్రభాస్ పూరీ కి ఓకే చెపుతాడా? చూద్దాం ఏం జరుగుతుందో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: