స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` పేరుతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మించనున్న ఈ యాక్షన్ డ్రామా… ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకి యువ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలు అందించనున్నారని తెలిసింది. అదే గనుక నిజమైతే… బన్నీ, అనిరుధ్ కాంబినేషన్లో వచ్చే తొలి చిత్రమిదే అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళనాట క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిరుధ్… ప్రస్తుతం `దర్బార్`, `ఇండియన్ 2` వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక `అజ్ఞాతవాసి`తో తెలుగునాట తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్… ఇటీవల `జెర్సీ`కి స్వరాలు అందించాడు. అలాగే విడుదలకు సిద్ధమైన `నానీస్ గ్యాంగ్ లీడర్`కి కూడా తనే బాణీలు అందిస్తున్నాడు. త్వరలోనే `ఐకాన్`లో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























