`ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి… మళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి దక్కింది. కాగా… ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయికగా నటిస్తోంది. ఆ చిత్రాలే… ‘వెంకీమామ’ (వెంకటేష్, నాగచైతన్య కథానాయకులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్ మూవీ. వీటిలో నాగచైతన్యకి జోడీగా నటిస్తున్న `వెంకీమామ`నే ముందుగా తెరపైకి రానుంది. అంతేకాదు… ఇందులో ఇదివరకు తను పోషించని కొత్త తరహా పాత్రలో కనిపించబోతోందట రాశి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… `వెంకీమామ`లో ఆధునిక భావాలు కలిగిన ఫిల్మ్ మేకర్ పాత్రలో దర్శనమివ్వనుందట రాశి. అలాగే… మనసు చెప్పినట్టు నడుచుకునే తలబిరుసు అమ్మాయిగా కనిపించనుందట. చాలా స్టైలిష్‌గా ఉండే ఈ పాత్రలో రాశి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుందని సమాచారం. మొత్తానికి… మరోసారి అభినయానికి అవకాశమున్న పాత్రలోనే రాశి నటిస్తుందన్న మాట. కాగా… కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న `వెంకీమామ` దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=7ZNuhUWCKzU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: