సురేష్ ప్రొడక్షన్స్… తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థలలో ఒకటి. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. అంతేకాదు ఎంతో మంది హీరో హీరోయిన్స్ కూడా ఈ సంస్థ ద్వారా పరిచయమయ్యారు. అందుకే మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఈ సంస్థను స్థాపించి దాదాపు 55 ఏళ్ళు కావస్తున్నా కూడా ఏనాడూ వెనుకపడలేదు. రామానాయుడుతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ.. రామానాయుడు అనంతరం…ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు సురేష్ బాబు.. ఇప్పుడైతే అటు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే.. చిన్న సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఎస్పీ ప్రొడక్షన్స్ సంజీవని లాంటిదని చెప్పొచ్చు. అలా చిన్న సినిమాలకు మంచి ప్రోత్సాహం అందించి ఇప్పుడు వరుసగా మూడు హ్యాట్రిక్స్ కొట్టింది ఈ సంస్థ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్లి చూపులు సినిమాతో తెలంగాణ స్లాంగ్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని తనను పెట్టి సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. అలా తను ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చి హిట్ అయిన సినిమా ‘మల్లేశం’. చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో జూన్ 14 న రిలీజ్ అయిన ఈసినిమా హిట్ కొట్టింది.
ఇక ఇదే సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో రిలీజ్ అయి హిట్ కొట్టిన సినిమా ‘బ్రోచేవారెవరురా’. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నివేదా థామస్, సత్యరాజ్, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా విమర్శకులు ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ‘ఓ బేబి’ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ హ్యాట్రిక్ కొట్టింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాకు కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. సమంత నటనకు.. సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో వరుసగా హ్యాట్రిక్ కొట్టింది ఎస్పీ ప్రొడక్షన్.
ఇవే కాదు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. వెంకీ మూడు సినిమాలు.. తరుణ్ భాస్కర్ మూవీ, త్రినాథ్ నక్కిన మూవీ, బాలీవుడ్ మూవీ ‘దే దే ప్యార్ దే’ రైట్స్‌ను కూడా సొంతం చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్. వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కే ఈ కామెడీ ఎంటర్టైనర్ను కూడా నిర్మించనుందీ సంస్థ. రానా ప్రధాన పాత్రల్లో రెండు సినిమాలను కూడా నిర్మిస్తుంది. వెంకీ, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీమామ’ చిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలసి నిర్మిస్తుంది. ఇలా చిన్నా, పెద్దా అనే తేడా లెేకుండా అన్ని సినిమాలకు ప్రోత్సాహానిస్తూ ఎస్పీ ప్రొడక్షన్స్ ఆరు హిట్లు.. మూడు బ్లాక్ బస్టర్లతో దూసుకుపోవాలని కోరుకుందాం..
[subscribe]
[youtube_video videoid=zDsCVcUcCRA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: