టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘సీత’. తన తొలి చిత్ర దర్శకుడు తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డబ్బు మీద వ్యామోహంతో ఎటువంటి సాహసాన్నైనా చేసే ఒక అహంకార పూరితమైన అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే కథతో ‘సీత’ తెరకెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని… ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించాడు. ‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రమిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… ఈ సినిమాలో కాజల్ పాత్రతో పాటు సాయిశ్రీనివాస్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతోందని సమాచారం. మన్నారా చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో… ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. మరి… ఈ సినిమాతో కాజల్ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=cXlGET2oQh0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























