కార్తి – జ్యోతిక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

Karthi and Jyothika New Movie Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthi and Jyothika Next Film Updates,Karthi and Jyothika New Movie Shoot,Karthi New Movie Shooting Starts Today,Jyothika and Karthi New Movie Shooting Commence,Jyothika and Karthi To Work Together
Karthi and Jyothika New Movie Shoot Begins

దృశ్యం ఫేమ్ జితూ జోసఫ్ డైరెక్షన్ లో కార్తి హీరోగా కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి వదిన అయిన జ్యోతిక కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అందుకే అప్పుడే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని కార్తి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా ఈసినిమాలో సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. వయాకామ్ 18స్టూడియోస్ , పారలాల్ మైండ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇంకా ఈ సినిమాలతో పాటు కార్తి మరో రెండు మూడు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీనితో పాటు రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో ఓ సినిమా చేయనున్నాడు. మరి దేవ్ సినిమాతో కాస్త వెనుకపడ్డ కార్తికి ఈ ఏడాది ఎలా కలిసొస్తుందో చూద్దాం..

[subscribe]


[youtube_video videoid=_ML0-srkxNg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.