ఏడాదికో విజయంతో దూసుకుపోతున్న సమంత

Samantha on a Success Spree,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha Gives Hat Trick Movies,Actress Samantha New Movie Updates,Samantha Upcoming Film News,Samantha Next Project Details,Samantha Gets Success on Majili Movie
Samantha on a Success Spree

తెలుగునాట మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది సమంత. తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ మొదలు తాజా చిత్రం ‘మజిలీ’ వరకు సమంత పట్టిందల్లా బంగారమే. ఈ తరంలో ఈ స్థాయి విజయాలు అందుకున్న కథానాయక మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు… ప్రతి ఏడాది ఈ టాలెంటెడ్ బ్యూటీ ఖాతాలో కనీసం ఒక విజయవంతమైన చిత్రం అయినా ఉండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… 2010లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సమంత… ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కనీసం ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ‘ఏ మాయ చేసావే’ (2010), ‘దూకుడు’ (2011), ‘ఈగ’ (2012), ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’ (2013), ‘మనం’ (2014), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016), ‘రాజు గారి గది 2’, ‘అదిరింది’ (2017), ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ (2018), ‘మజిలీ’ (2019)… ఇలా సమంత జైత్రయాత్ర ప్రతి ఏడాది కొనసాగుతూనే ఉంది. మరి రాబోయే చిత్రాలతోనూ సామ్ ఇదే హవా కొనసాగిస్తోందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=Sbs-cc4dSoI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.