శ్రీ‌ను వైట్ల సినిమాని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన విష్ణు

Manchu Vishnu Confirms His Film With Sreenu Vaitla,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manchu Vishnu Next Film With Sreenu Vaitla,Hero Manchu Vishnu New Movie Updates,Sreenu Vaitla and Manchu Vishnu To Team Up Again,Sreenu Vaitla and Manchu Vishnu Planning To Do Movie Sequel
Manchu Vishnu Confirms His Film With Sreenu Vaitla

ఢీ`… మంచు విష్ణు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతోనే క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు విష్ణు. ఆ త‌రువాత `దేనికైనా రెడీ`, `దూసుకెళ్తా` చిత్రాల‌తోనూ విజ‌యాలు అందుకున్నాడు ఈ మంచు వారి క‌థానాయ‌కుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `ఢీ` త‌రువాత అటు శ్రీ‌ను వైట్ల‌… ఇటు మంచు విష్ణు వేర్వేరు ప్రాజెక్ట్‌లతో బిజీ కావ‌డంతో… వీరి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాలేదు. కాగా… ప‌న్నెండేళ్ళ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతోంద‌ని కొన్నాళ్ళ క్రితం క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే… ఈ విష‌యంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో… తాజాగా తిరుమ‌ల‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న విష్ణు… ద‌ర్శ‌నానంత‌రం ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించాడు. 12 ఏళ్ళ త‌రువాత శ్రీ‌ను వైట్ల‌తో సినిమా చేయ‌బోతున్నానని తెలిపాడు. మ‌రి… ఈ సినిమా `ఢీ`కి సీక్వెల్‌గా వ‌స్తుందా? లేదంటే కొత్త క‌థ‌తో వ‌స్తుందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా… మంచు విష్ణు తాజా చిత్రం `ఓట‌ర్‌` వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=_Rlo9_p7Cgg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.