టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రావాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ (వర్కింగ్ టైటిల్ ) చిత్రం ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ హల్ చల్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది.అయితే ఈ ఊహాగానాలన్నింటికీ ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఒకే ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్, నిర్మాత చినబాబు మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోను నాగ వంశీ షేర్ చేశారు. దాంతో విభేదాల వార్తల్లో నిజం లేదని, ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ చాలా సజావుగా ట్రాక్‌పైనే ఉందని స్పష్టం చేసినట్లయింది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో, ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో రాబోతున్న ఈ భారీ పౌరాణిక చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుందన్న వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























