హైందవ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ఎవరైనా రిలీజ్

Haindava First Single #Evaraina Lyrical Video is OUT NOW

‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్ లో ఉన్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఎవరైనా’ ను విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాలను కలిపి రూపొందించిన ఈ పాట వినగానే ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. మెలోడీ ట్యూన్, చక్కటి లిరిక్స్‌తో పాట మొదటిసారి విన్నప్పుడే కనెక్ట్ అయ్యేలా ఉంది.

కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ తమ వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

పాటలోని విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య కనిపించే మ్యాజిక్, వారి స్క్రీన్ ప్రెజెన్స్ పాటను మరింత ఆకట్టుకునేలా చేశాయి. ‘ఎవరైనా’ పాట ‘హైందవ’ ఆల్బమ్‌పై అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా, ఇప్పుడీ మెలోడీతో అంచనాలు పెంచింది.

ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ కన్నన్ డీవోపీగా పని చేస్తున్నారు, కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శివ కామేష్ డి ప్రొడక్షన్ డిజైనర్.’హైందవ’ నవంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.