బిగ్ బాస్ 10: సుధీర్‌ను కాపాడిన దీపావళి స్పెషల్ నో ఎలిమినేషన్ ట్విస్ట్

Bigg Boss 10 Sudheer Saved from Elimination on Diwali

బుల్లితెరపై ఆకట్టుకుంటున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 10 తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హౌస్‌లో ఆడియన్స్ ఓటింగ్ పరంగా అతి తక్కువ ఓట్లు సాధించి నామినేషన్లలో డేంజర్ జోన్‌లో నిలిచిన కంటెస్టెంట్ సుధీర్ ఎలిమినేషన్ ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వారం సుధీర్, యాంకర్ వర్షిణి, నీతూ మరియు శివకుమార్ నామినేషన్స్‌లో చివరి స్థానాల్లో నిలిచారు. చివరి ఘట్టంలో నీతూ ఓపెన్ చేసిన లాకర్‌లో నీతూ సేఫ్ అని ఉండటంతోపాటు, ఆమె వెనుక ఉన్న కార్డు ఆధారంగా సుధీర్ పేరు కూడా బయటకు వచ్చింది. నిజానికి తక్కువ ఓటింగ్ వల్ల సుధీర్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ, దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని హోస్ట్ నాగార్జున ‘నో ఎలిమినేషన్’ అని ప్రకటించి సుధీర్‌ను సేవ్ చేశారు. ఇటీవల జరిగిన ‘రివార్డ్ అండ్ రివేంజ్’ టాస్క్‌ల సమయంలో ముకేష్, అమన్‌లతో సుధీర్‌కు తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.

హౌస్‌లో జరిగిన వివాదాలతో మానసికంగా విసిగిపోయిన సుధీర్, నామినేషన్ల ఒత్తిడి తట్టుకోలేక ఆడియన్స్‌ను ఉద్దేశించి “నా ఆట నచ్చకపోతే నన్ను ఎలిమినేట్ చేసేయండి” అంటూ ఆవేశంలో మైక్, బ్యాగ్ కింద పడేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దీపావళి స్పెషల్ ట్విస్ట్‌తో బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశంతో సుధీర్ సేఫ్ జోన్‌లోకి అడుగుపెట్టారు. పండుగ ఆనందంలో ఎలిమినేషన్ రద్దు కావడం సుధీర్ అభిమానులకు మరియు ఆయనకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ సేవ్ తర్వాత పదో వారంలో సుధీర్ తన ఆటతీరును ఏ విధంగా మార్చుకుని ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.