సీన్ 3 రోజుల్లో ఎంత రాబట్టిందంటే

Scene 3-Day Box Office Collections

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సీన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం 3రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లతో రూ. 145 కోట్లకు పైగా గ్రాస్ సాధించి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆవేశం’ ఫేమ్ హిట్ మేకర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్ట్‌ను సూర్య, జ్యోతిక మరియు నజ్రియా ఫహద్ కలిసి నిర్మించారు. సుశిన్ శ్యామ్ అందించిన హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైనమిక్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవగా, సూర్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, విష్ణు గోవింద్ సౌండ్ డిజైన్ మరియు చేతన్ డిసౌజా యాక్షన్ కంపోజిషన్ థియేటర్లలో ప్రేక్షకులకు పీక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి.

నస్లేన్, ఆశ్విని మరియు మషార్ హంసా వంటి ప్రతిభావంతమైన తారాగణం కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు ఫార్స్ ఫిల్మ్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాయి. ప్రస్తుతం అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న ‘సీన్’ రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.