భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజికల్ విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.ఈరోజు సెలవు దినం కావడంతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బుక్‌మైషో చరిత్రలోనే ఒకే గంటలో అత్యధికంగా 140K (1.40 లక్షల కంటే ఎక్కువ) టికెట్లు అమ్ముడై ‘రామాయణ’ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ చిత్రానికి రాని స్థాయిలో గంట వ్యవధిలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషం. ర
ఈ క్రమంలోనే ‘రామాయణ’ చిత్రం గతంలో ఉన్న బిగ్గెస్ట్ పాన్-ఇండియా సినిమాల ఆల్ టైమ్ రికార్డులను సైతం అధిగమించింది.
బుక్‌మైషోలో ఒకే గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడైన టాప్ 5 చిత్రాల వివరాలు:
రామాయణ: పార్ట్ 1 – 140K +
ధురంధర్: ది రివేంజ్ – 109.17K
పుష్ప 2: ది రూల్ – 107.65K
L2: ఎంపురాన్ – 96.14K
కల్కి 2898 AD – 95.71K
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా మరియు యష్ రావణాసురుడిగా నటించిన ఈసినిమా మొదటి రోజు కంటే ఈరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది. ఈఒక్క రోజే 160కోట్ల వసూళ్లను రాబట్టుకునే అవకాశాలు వున్నాయి.కేవలం నాలుగు రోజుల్లోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా ఈసినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంటుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























