నెట్ ఫ్లిక్స్ లోకి రానున్న రణబాలి … స్ట్రీమింగ్ డేట్ ఇదే

Netflix Announces Streaming Date for Ranabaali

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయికగా తెరకెక్కిన పీరియాడికల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోగా, నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, రష్మికతో ఉన్న ఎమోషనల్ కెమిస్ట్రీ మరియు మైకేల్ జె. రీడ్ అందించిన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లలో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిన అభిమానులకు నవంబర్ 13 నుంచి ఇంట్లోనే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ఆస్వాదించే అవకాశం లభించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.