ఈఎన్ఈ రిపీట్ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Priyadarshi Ram’s First Look as Muralidhar from ENE Repeat Released

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat’ లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో ప్రియదర్శిని రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్‌గా ఆయన పాత్ర పరిచయం చేశారు. ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? #ENERepeat విమానంలో అతను ఏమి చేస్తున్నాడు? అంటూ మేకర్స్ రివిల్ చేసిన లుక్ ఆకట్టుకుంది.

2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ENE Repeat’ రూపొందుతోంది.  

ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్‌గా, అభినవ్ గోమఠం కౌశిక్‌గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్‌గా అలరించనున్నారు. తొలి పార్ట్ లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమా నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.