మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డ్యూ డేట్.’ వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల కమెడియన్ కృష్ణభగవాన్ ‘డ్యూ డేట్’ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నాడు.
ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్లో నటుడు సునీల్ జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో సునీల్ ఓ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కెరీర్ల్ ఇదొక డిఫరెంట్ పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో మరో కీలకమైన లాయర్ పాత్రలో నటి అక్షర గౌడ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను అందించండతో పాటు అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది’ అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























