నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ విడుదల ముంగిట బుకింగ్స్ మోతెక్కిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అసాధారణ స్పందన లభిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘బుక్‌మైషో’ ప్లాట్ఫామ్లో గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతుండటం ఈ సినిమాపై ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ₹37 కోట్లకు సొంతం చేసుకోగా, అడ్వాన్స్ సేల్స్ ఊపు చూస్తుంటే మొదటి రోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక అటు ఓవర్సీస్ లో కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ మార్క్ చేరువలో వుంది.
174 నిమిషాల నిడివితో (A-సర్టిఫికేట్) వస్తున్న ఈ చిత్రం, అనిరుధ్ రవిచందర్ అందించిన సాంగ్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు రా-యాక్షన్ ఎలిమెంట్స్‌తో హైప్‌ను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్ళింది. ఈనెల 24న ఈసినిమా విడుదలకానుండగా తెలుగు రాష్ట్రాల్లో రేపు సాయంత్రం 6 గంటలనుండి స్పెషల్ షోస్ పడనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























