సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో రూపొందిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’ బాక్సాఫీస్ వద్ద విజయాభినందనలు అందుకుంటోంది. థియేటర్లలోకి వచ్చిన నాటి నుంచే యువతను, కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.4 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా అధికారికంగా వెల్లడించారు.
సినిమాలోని నవ్వులు పూయించే సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుండటంతో వీకెండ్లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా పాజిటివ్‌గా ఉండటంతో రాబోయే రోజుల్లో ‘రోమాంచకం’ బాక్సాఫీస్ దగ్గర మరిన్ని మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























