యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షూటింగ్‌కు తాత్కాలికంగా చిన్న విరామం ఇచ్చారు. అయితే నందమూరి అభిమానులకు ఊరటనిచ్చే విషయమేమిటంటే, మరొక రెండు వారాల్లో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిన్న బ్రేక్ మినహా సినిమా షెడ్యూల్స్ ఏవీ మారలేదు.
రాబోయే ఫిబ్రవరి నాటికి సినిమా సంపూర్ణ చిత్రీకరణను పూర్తి చేయాలనే దిశగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేశారు. షూటింగ్ పూర్తయిన వెంటనే గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయనున్నారు. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పులు ఉండబోవని, అనుకున్న సమయానికే ఈ మాసివ్ యాక్షన్ వండర్‌ను థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్రబృందం శ్రమిస్తోంది. తీసుకురానున్నామని నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా జూన్ 11న 2027న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























