అక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం ‘కింగ్ 100’ గ్లింప్స్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా అధికారికంగా విడుదల చేశారు. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే ఈ గ్లింప్స్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, మరొకటి డబ్బు లేని వాళ్లు” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో నాగార్జున పాత్రను పరిచయం చేశారు. డబ్బు లేని ఒక పేదవాడు కసితో ఎదిగి, మోసాలు చేస్తూ బాగా సంపాదించి ‘కింగ్’ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే కోణంలో కథ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో ఫాదర్ ఎమోషన్‌తో పాటు నాగార్జున ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ వర్షన్‌లో కూడా కనిపించనున్నారు.
‘నితమ్ ఒరు వానమ్’ ఫేమ్ రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాల తర్వాత నాగార్జున, టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా ఉండనుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు గ్లింప్స్ ముగింపులో ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























