మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో అద్భుతంగా ఉందని, త్రినాథ్ పాత్రలో రవితేజ తన పవర్‌ఫుల్ నటనతో సినిమాను మొత్తం భుజాలపై మోశారని కొనియాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కథను ఎంతో లోతుగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ పనితనాన్ని మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు అందించడమే కాకుండా, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ సహా చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అంతేకాకుండా, “ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!” అంటూ ఇండస్ట్రీ ఐక్యతను చాటుతూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























