మెగాస్టార్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. వైరల్‌గా మారిన అల్లు అర్జున్ ట్వీట్

Allu Arjun’s Heartfelt Wishes to Megastar Chiranjeevi Go Viral

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా (X) వేదికగా చెప్పిన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా అందరికీ కొండంత అండగా నిలిచారు. మాలో ప్రతి ఒక్కరినీ వెన్నుతట్టి ప్రోత్సహించి, ఉన్నత స్థాయికి చేర్చిన గొప్ప స్ఫూర్తిప్రదాత ఆయన” అని పేర్కొంటూ మెగాస్టార్‌పై తనకున్న అమితమైన గౌరవాన్ని మరియు అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ ట్వీట్‌లో బన్నీ ఉపయోగించిన #KKAVCF (Iykyk) అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దీని అర్థం ఏంటంటే గతంలో ఓ సినీ వేడుకలో బన్నీ చెప్పిన “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అనే డైలాగ్‌ను షార్ట్ ఫార్మ్‌లో #KKAVCF అని రాశారు.

పక్కనే ఉన్న ‘Iykyk’ అంటే “If You Know, You Know” (తెలిసిన వారికి అర్థమవుతుంది) అని పేర్కొంటూ తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమాభిమానం ఎప్పటికీ చెరిగిపోదని మరోసారి నిరూపించారు.

అల్లు అర్జున్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దీని అర్థం ఏంటంటే గతంలో ఓ సినీ వేడుకలో బన్నీ చెప్పిన “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అనే డైలాగ్‌ను షార్ట్ ఫార్మ్‌లో #KKAVCF అని రాశారు.అల్లు అర్జున్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.