డిసితో లోకేష్ కనగరాజ్ గారు హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు – నిర్మాత సురేష్ బాబు

Lokesh Kanagaraj Delivered a Blockbuster Hit as the Hero of DC says Producer Suresh Babu

లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డిసి’. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న  ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం. ‘డీసీ’ సినిమాకు వస్తున్న రిపోర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, మేమంతా కలిసి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాం. లోకేష్ కనగరాజ్ గారు పెద్ద దర్శకుడు. ఇప్పుడు మొదటిసారి హీరోగా నటించారు. అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో ప్రారంభమైంది. అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. హై రేటింగ్స్ వస్తున్నాయి. చాలా గొప్ప టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన సినిమా ఇది. టెక్నికల్‌గా సినిమా చాలా బ్రిలియంట్‌గా ఉంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది. అరుణ్ మాథేశ్వరన్ అద్భుతంగా తెరకెక్కించారు. వామికా గబ్బి, మిగతా నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ప్రతి షోకి ఆదరణ పెరుగుతోంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.  ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ట్రైలర్ చూసే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు. కొత్తదనం కనిపిస్తే తప్పకుండా థియేటర్‌కు వస్తారు. అనిరుధ్ అందించిన సంగీతాన్ని ప్రేక్షకులు థియేటర్లలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ గారు, అనిరుధ్ గారు, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ వచ్చే వారం హైదరాబాద్‌కు వస్తారు. అప్పుడు గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తాం.

నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చిన సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ‘డీసీ’ అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే భవిష్యత్తులో రాబోతున్న ‘జైలర్ 2’ కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.”

నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ: ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన సన్ పిక్చర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.