సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకురానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘మహేంద్రగిరి వారాహి’ జర్నీ రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైంది. సంతోష్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఒక మంచి నిర్మాత కోసం ఎదురు చూశాం. మధు గారు, లక్ష్మణ్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ సమకూర్చి, చాలా గొప్పగా తీర్చిదిద్దారు. టీజర్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్నాం. సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు తప్పకుండా సంతృప్తి చెందుతారు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































