విశ్వనాథన్ & సన్స్ నుండి ది వెడ్డింగ్ సాంగ్ ప్రోమో అవుట్

The Wedding Song’Promo from Viswanathan & Sons Out Now

వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో దుల్కర్ సల్మాన్, మమితా బైజు జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ .ఇప్పటికే విడుదలైన మొదటి పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ ‘ది వెడ్డింగ్ సాంగ్’ తెలుగు ప్రోమోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాటకు సంబంధించిన అతిపెద్ద విశేషం ఏమిటంటే.. కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య ఈ పాటను ఆలపించడం! జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ఎనర్జిటిక్ అండ్ మధురమైన బాణీలకు సూర్య తన ప్రత్యేకమైన గాత్రంతో సరికొత్త జోష్ తీసుకొచ్చారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వెడ్డింగ్ వైబ్స్‌తో ఈ పాట ఎంతో వేడుకగా రూపుదిద్దుకుంది.

పూర్తి పాటను జూలై 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ డ్రామా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.