కొరియన్ కనకరాజు నుండి మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ రాసా గుమ్మాడి రిలీజ్

RassaGummadi Song from Korean Kanakaraju Released

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ లిరికల్ సాంగ్ విడుదలవుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదివారం సాయంత్రం ఏపీలోని అనంతపురం వి మెగా థియేటర్‌లో అభిమానుల కోలాహలం మధ్య ఈ మాస్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ పాటకు అదిరిపోయే ఫోక్ అండ్ మాస్ ట్యూన్ అందించగా.. స్టార్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ పవర్‌ఫుల్ సాహిత్యం అందించారు. జానపద గాయకుడు నల్గొండ గద్దర్ తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు కొత్త ప్రాణం పోశారు.

రాయలసీమ జాతర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో వరుణ్ తేజ్ ఊరమాస్ స్టెప్పులతో రచ్చ చేశారు. “మా పెదనాన్న చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకునే ఈ పాటకు డ్యాన్స్ చేశాను” అని వరుణ్ తేజ్ ప్రత్యేకంగా చెప్పారు. ఈ పాటలో బ్యూటీ దక్షా నాగర్కర్ స్పెషల్ అప్పీరెన్స్‌తో మెరిసిపోగా, వరుణ్-దక్షా జోడీ కెమిస్ట్రీ, విజువల్స్ పక్కా ఫెస్టివ్ వైబ్‌ను తీసుకొచ్చాయి.

రితికా నాయక్ హీరోయిన్‌గా, హాస్య నటుడు సత్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.